అయోధ్య రామ భక్తులకు బిగ్ అలర్ట్.. దర్శనం కావాలంటే వెంట అది తప్పనిసరి!

by GSrikanth |
అయోధ్య రామ భక్తులకు బిగ్ అలర్ట్.. దర్శనం కావాలంటే వెంట అది తప్పనిసరి!
X

దిశ, వెబ్‌డెస్క్: అయోధ్య బాలరాముడి దర్శన సమయాలపై తీర్థక్షేత్ర ట్రస్ట్ క్లారిటీ ఇచ్చింది. ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుంచి 11:30 గంటల వరకు.. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు భక్తులు దర్శన సౌకర్యం ఉంటుందని పేర్కొన్నారు. బాలరాముడి దర్శన నిమిత్తం అయోధ్యకు వచ్చే భక్తులంతా వెంట ఆధార్ కార్డు తెచ్చుకోవాలని రామజన్మభూమి ట్రస్ట్ వెల్లడించింది. ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌లో దర్శన, హారతి పాసులు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వెబ్‌సైట్‌లో స్లాట్ బుకింగ్ సౌలభ్యం కల్పించినట్లు వెల్లడించారు.

కాగా, మరోవైపు అయోధ్యలో బాలరాముడిని దర్శించుకునేందుకు మంగళవారం భక్తులు పోటెత్తారు. ఆలయ ప్రధాన ద్వారం వద్దకు ఒకేసారి అధిక సంఖ్యలో వచ్చారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే క్యూలైన్‌లో నిల్చున్నారు. అయితే, ఒక్కసారిగా భక్తులు తాకిడి భారీగా పెరగడంతో నియంత్రించడం సిబ్బంది వల్ల కాలేదు. ఆ క్రమంలో తోపులాట జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని భారీ భద్రత ఏర్పాటు చేశారు.

Advertisement

Next Story

Most Viewed