Mahindra BE6 Bookings: మహీంద్రా అంటే అలా ఉంటుంది మరి.. ఫస్ట్ రోజు ఈ కారు బుకింగ్స్‌ తెలిస్తే దిమ్మదిరిగిపొద్ది!

by Vennela |
Mahindra BE6 Bookings:  మహీంద్రా అంటే అలా ఉంటుంది మరి.. ఫస్ట్ రోజు ఈ కారు బుకింగ్స్‌ తెలిస్తే దిమ్మదిరిగిపొద్ది!
X

దిశ, వెబ్‌డెస్క్: Mahindra BE6 Bookings: ఫిబ్రవరి 14వ తేదీ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా మహీంద్రా(Mahindra) బీఈ6, మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ(Mahindra BE6 Bookings) ఎలక్ట్రిక్ వాహనాల బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. తొలిరోజే భారీగా బుకింగ్స్ సంపాదించుకున్నాయి. ఈ రెండింటికి మొదటి రోజే 30,179 బుకింగ్స్ వచ్చాయి. ఫలితంగా ఈ ఎలక్ట్రిక్ ఎస్ యూవీ(SUV)ల బుకింగ్ వాల్యూ రూ. 8, 472 కోట్లకు చేరుకుంది. ఈ 30,179 బుకింగ్స్ లో 44శాతం మంది బీఈ6ని ఎంచుకుని మిగిలిన 56శాతం మంది ఎక్స్ఈవీ 9ఈని బుక్ చేసుకున్నారు. అంతేకాదు మొత్తం మీద 79శాతం బుకింగ్స్ టాప్ ఎండ్ వేరియంట్స్(Top-end variants) కే వెళ్లడం గమనార్హం.

అన్లిమిట్ లవ్(Unlimited Love) అనే బ్రాండ్ థీమ్ కు అనుగుణంగా మహీంద్రా(Mahindra) తన కొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీలు బీఈ6(Electric SUVs BE6), ఎక్స్ ఈవీ 9ఈ(XEV 9E)ల బుకింగ్స్ ను వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రారంభించింది. ఆసక్తిగల కొనుగోలుదారులు తయారీదారు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించడం ద్వారా ఆన్ లైన్ లో లేదా ఆఫ్ లైన్లో సమీపంలోని మహీంద్రా డీలర్ షిప్ షోరూమ్ ను సందర్శించి వెహికల్స్ ను బుక్ చేసుకోవచ్చు. పర్మామెన్స్ ఓరియెంటెడ్ ఎస్యూవీ బీఈ6 ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ. 19.4లక్షలుగా ఉంది. ఇక ఎక్స్ ఈవీ 9ఈ ప్రారంభ ధఱ రూ. 22.4లక్షలు. దీనితోపాటు మహీంద్రా టాప్ స్పెక్ వేరియంట్స్ కోసం ఇతర సౌకర్యవంతమైన చెల్లింపు ప్రణాళికలను కూడా అందిస్తోంది.

ఎక్స్ఈవీ 9ఈ(XEV 9E), బీఈ6(SUVs BE6) ఫీచర్లు, డిజైన్ భిన్నంగా ఉన్నప్పటికీ అవి ఒకే పవర్ ట్రైన్ ను పంచుకుంటాయి. మహీంద్రా ఐఎన్జీఎల్ఓ ఆర్కిటెక్చర్ రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ కలిగి ఉన్నాయి. అవి 59కిలో వాట్ 79 కిలోవాట్ల లిథియం ఐరన్ ఫాస్పెట్ యూనిట్లు ప్రారంభంలో ఎక్స్ఈవీ 9ఈ, బీఈ6ఈ ఎలక్ట్రిక్ ఎస్ యూవీలు రెండు 59 కిలోవాట్ల బ్యాటరీని ప్యాక్ ను అందిస్తాయి.

మహీంద్ర(Mahindra) తెలిపిన వివరాల ప్రకారం బీఈ6 175కిలోవాట్ల డీసీ ఫాస్ట్ ఛార్జర్ ఉపయోగించినప్పుడు కేవలం 20 నిమిషాల్లోనే 20శాతం నుంచి 80శాతం వరకు ఛార్జ్ అవుతుంది. 59కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ రేంజ్ ను ఇంకా చెప్పలేదు. 79కిలోవాట్ల ప్యాక్స్ ఏఆర్ఏఐ టెస్టింగ్ ప్రకారం 682 కిలోమీటర్ల పరిధిని సాధిస్తుందని సంస్థ పేర్కొంది. చిన్న బ్యాటరీ 228 బీహెచ్పీ పవర్ ను పెద్ద 79 కిలోవాట్ల వర్షన్ 278 బీహెచ్ పీ పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. ముఖ్యంగా రెండు బ్యాటరీ ఆప్షన్స్ 380 ఎన్ఎమ్ స్థిరమైన టార్క్ ను ఉత్పత్తి చేస్తుంటాయి.

ఇక మహీంద్ర(Mahindra) కంపెనీ జోరుమీదుంది. ఇప్పటికే 2,281 యూనిట్ల ఎక్స్ఈవీ 9ఈ, బీ6ఎలక్ట్రిక్ ఎస్ యూవీలను తయారు చేసింది. వీటిల్లో 1837 యూనిట్లను డిస్పాచ్ కూడా చేసింది. రానున్న రోజుల్లో డిమాండ్కు తగ్గట్లుగా ప్రొడక్షన్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ రెండు కార్ల ప్యాక్ త్రీ వేరియంట్ డెలివరీలు 2025 మార్చ్ మధ్య నుంచి ప్రారంభమవుతాయి. ప్యాక్ త్రీ సెలెక్ట్ , ప్యాక్ టూ డెలివరీలు వరుసగా జూన్ 2025 జులై 2025 నుంచి షురూ కానున్నాయి. ఎంట్రీ లెవల్ వేరియంట్లు అయిన వన్, వన్ అబౌవ్ లు డెలివరీలు 2025 ఆగస్టులో షురూ కానున్నాయి.

Next Story

Most Viewed