ఆక్స్‌ఫర్డ్ టీకాకు 95శాతం సామర్థ్యం: ఆస్ట్రా జెనెకా సీఈవో

by Shamantha N |
ఆక్స్‌ఫర్డ్ టీకాకు 95శాతం సామర్థ్యం: ఆస్ట్రా జెనెకా సీఈవో
X

న్యూఢిల్లీ: ఆక్స్‌ఫర్డ్ టీకా 95శాతం మంది పేషెంట్లను రక్షించగలదని, ఫైజర్, మొడెర్నాలలకు దీటుగా పనిచేస్తుందని ఆస్ట్రా జెనెకా ఫార్మా సంస్థ సీఈవో పాస్కల్ సొరియట్ తెలిపారు. అన్ని వయస్కులవారినీ కరోనా వైరస్ నుంచి రక్షించే సామర్థ్యమున్నదని పేర్కొన్నారు. ఆక్స్‌ఫర్డ్ టీకా విన్నింగ్ ఫార్ములా కలిగి ఉన్నదని సండే టైమ్స్ పత్రికకు చెప్పారు. అయితే, ఈ వ్యాఖ్యలను సమర్థించే డేటాను సంస్థ ఇంకా విడుదల చేయాల్సి ఉన్నది. మూడో దశ ట్రయల్స్ మధ్యంతర ఫలితాలను గతనెల విడుదల చేసింది. ఈ టీకా సగటున 70శాతం సమర్థవంతమైనదిగా తేలింది. పూణెకు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తున్న ఈ టీకాకు అత్యవసర అనుమతినివ్వాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు కొన్నివర్గాల సమాచారం.

Advertisement

Next Story

Most Viewed