రేపు 9 రాష్ట్రాల సీఎంలతో మోడీ వీడియో కాన్ఫరెన్స్

by Shamantha N |
రేపు 9 రాష్ట్రాల సీఎంలతో మోడీ వీడియో కాన్ఫరెన్స్
X

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌పై సమీక్షించేందుకు ప్రధాని మోడీ తొమ్మది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఉదయం 10గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశంలో తూర్పు, ఈశాన్య రాష్ట్రాల (బీహార్, ఒడిశా, గుజరాత్, హర్యానా, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పుదుచ్చెరీ, మేఘాలయ, మిజోరం) ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు. పొడిగించిన లాక్‌డౌన్‌పైన, సడలింపులపైన సమీక్ష జరపడంతో పాటు లాక్‌డౌన్ అనంతరం వలసల తరలింపు ప్రక్రయపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. అలాగే, కేంద్రం నుంచి రావాల్సిన ఆర్థిక ప్యాకేజీ, టెస్టు కిట్ల కొరత, వైద్యుల రక్షణకు సంబంధించిన అంశాలను లేవనెత్తనున్నట్టు స్పష్టమవుతోంది. కాగా, మార్చి 14న దేశవ్యాప్త లాక్‌డౌన్ విధించిన అనంతరం సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం ఇది నాలుగోసారి. తొలి సమావేశం మార్చి 20న నిర్వహించగా, ఎనిమిది రాష్ట్రాలు పాల్గొని వైరస్ నియంత్రణ, వైద్యసదుపాయలు మెరుగుపర్చడం, స్థానిక వైద్య సిబ్బందికి శిక్షణనివ్వడం వంటి అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాయి. రెండో సమవేశం ఏప్రిల్ 2న నిర్వహించగా, మరో ఎనిమిది రాష్ట్రాలు పాల్గొని లాక్‌డౌన్ అనంతరం చేపట్టాల్సిన వ్యూహాల్ని చర్చించాయి. మూడో సమావేశం 11న జరగ్గా.. ఇందులో దాదాపు 13 రాష్ట్రాల సీఎంలు లాక్‌డౌన్‌ను పొడిగించాలని కోరారు.

tags: modi, video conference with cm’s, corona, virus, covid 19, nine states, lockdown

Advertisement

Next Story