కరోనా నడుమ ‘9/11’ సంస్మరణ

by vinod kumar |
కరోనా నడుమ ‘9/11’ సంస్మరణ
X

వాషింగ్టన్: అమెరికాలో కరోనా సృష్టిస్తున్న విలయతాండవం చేస్తున్న సమయంలోనే… 9/11 ఉగ్రవాద దాడుల్లో మృతుల సంస్మరణ కార్యక్రమం రేపు జరగనుంది. అల్‌ఖైదా దాడుల్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ టవర్‌లపై దాడుల్లో కనీసం మూడు వేల మంది మరణించారు. వీరిని సంస్మరించుకోవడానికి ప్రతిఏడాది ఘటనాస్థలం దగ్గర నిర్వహించే స్మరణలో మృతుల పేర్లను వారి కుటుంబీకులు చదువుతారు. కానీ, కరోనా కారణంగా ఈ సంస్మరణలో పలుమార్పులు కనిపించనున్నాయి.

ఈ సారి మృతుల పేర్లు కేవలం రికార్డింగ్‌లో ప్లే అవుతాయి. అక్కడకు వచ్చినవారంత మాస్కులు ధరించి భౌతిక దూరాన్ని పాటించాల్సి ఉంటుంది. ఒకేచో జరగాల్సిన ఈ కార్యక్రమం ఈ ఏడాది విడిగా రెండు చోట్ల జరగనుంది. ఈ కార్యక్రమాలకు మైక్ పెన్స్, జో బైడెన్‌లు హాజరుకానున్నట్టు తెలిసింది.

Advertisement

Next Story