మహిళ కడుపులోంచి 8 కిలోల కణతి తొలగింపు

by Sridhar Babu |   ( Updated:2021-11-18 00:02:14.0  )
tumour-Removed
X

దిశ, కల్లూరు: ఓ మహిళకు వైద్యులు ఆపరేషన్ చేసి ఆమె కడుపులోంచి 8 కిలోల కణతిని తొలగించారు. వివరాల్లోకి వెళితే.. పెడ్డకొరుకొండికి చెందిన దుగ్గిరాల భద్రమ్మ (45) గత కొంత కాలంగా కడుపు నొప్పితో బాధపడుతూ చికిత్స నిమిత్తం కల్లూరులోని మాధవి హాస్పటల్ కు వచ్చింది. ఆమెను పరీక్షించిన డాక్టర్ మాధవి స్కానింగ్ చేసి కడుపులో పెద్ద కణతి ఉందని, దానిని ఆపరేషన్ చేసి తొలగించాలని నిర్ధారించారు. గురువారం ఉదయం 7 గంటలకు ఆపరేషన్ చేసి కడుపులో ఉన్న కణతిని తొలగించారు.

Advertisement

Next Story

Most Viewed