లీటర్‌కు 850 ML.. జనగామలోని ఓ పెట్రోల్‌ బంక్‌లో దోపిడీ..!

by Sumithra |
లీటర్‌కు 850 ML.. జనగామలోని ఓ పెట్రోల్‌ బంక్‌లో దోపిడీ..!
X

దిశ, జనగామ: రోజురోజుకు పెట్రోల్ ధరలు పెరుగుతుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పెట్రోల్ బంకు నిర్వాహకులు అక్రమాలకు పాల్పడుతూ.. వాహనదారులకు అందించాల్సిన పెట్రోల్ సక్రమంగా అందించకుండా నిలువునా దోచుకుంటున్నారు. సాధారణంగా ఒక లీటర్ పెట్రోల్ కొట్టిస్తే 1000 Ml వస్తుంది కానీ.. ఆర్టీసీ పెట్రోల్ బంక్‌లో మాత్రం 850 M L పెట్రోలు మాత్రమే వస్తుందని వాహనదారులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటన జనగామ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.

తరచూ ఈ బంక్‌లోనే పెట్రోల్ కొట్టించే ఓ వాహనదారుడి బండి మైలెజ్ తక్కవ ఇస్తుండడంతో అనుమానం వచ్చి ఒక లీటర్ పెట్రోల్‌ను కొలతల డబ్బాలో కొట్టించారు. ఈ క్రమంలో లీటర్ పెట్రోల్‌కి 150 ML పెట్రోల్ తక్కువగా రావటాన్ని వాహనదారులు గుర్తించారు. ఇటువంటి అక్రమాలకు పాల్పడుతున్న పెట్రోల్ బంక్ యాజమాన్యంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, పెట్రోల్ తక్కువ వచ్చిన ఘటనపై దిశ పత్రిక సంబంధిత లీగల్ మెట్రాలజీ అధికారులను ఫోన్‌లో వివరణ కోరగా.. సంఘటనపై వారికి ఎటువంటి ఫిర్యాదు రాలేదని, ఎక్కడైనా ఏదైనా అవకతవకలు జరిగితే వారికి ఫిర్యాదు చేయాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed