- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
క్యాంపస్‌లో కాల్పులు.. 8 మంది విద్యార్థులు మృతి
by Sumithra |

X
దిశ, వెబ్‌డెస్క్: రష్యాలో కాల్పులు కలకలం సృష్టించాయి. పెర్మ్ నగరంలోని ఓ యూనివర్సిటీలో గుర్తుతెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో 8 మంది మృతిచెందారు. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన రష్యా పోలీసులు కాల్పులు జరిపిన వ్యక్తిని హతమార్చారు. ఈ మేరకు రష్యా న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. సోమవారం ఉదయం యూనివర్సిటీ క్యాంపస్‌లోకి నడుచుకుంటూ వెళ్లిన ఆ దుండగుడు ఒక్కసారిగా గన్ తీసి కాల్పులు జరిపినట్లు స్థానిక విద్యార్థులు చెబుతున్నారు. ఈ కాల్పుల్లో 8 మంది మరణించడంతో తప్పించుకునేందుకు మిగతా విద్యార్థులు భవనం కిటికీల నుంచి కిందకు దూకుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొంతమంది తరగతి గదుల్లోనే దాక్కున్నారు. నాన్ లీగల్ గన్‌తో దుండగుడు కాల్పులు జరిపినట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు.
Next Story