- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
75 వేల డబుల్ బెడ్రూం ఇళ్లు పంపిణీకి సిద్ధం..!
by Shyam |
X
దిశ ప్రతినిధి, మేడ్చల్:
జీహెచ్ఎంసీ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహించారు. బుధవారం ప్రగతి భవన్లో జరిగిన ఈ సమావేశంలో అయా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా జరుగుతున్న కార్యక్రమాలపై మంత్రి మల్లారెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహాన్లతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఈ ఏడాది సుమారు 75 వేల డబుల్ బెడ్రూం ఇళ్లు పంపిణీకి సిద్ధంగా ఉంటాయని స్పష్టం చేశారు. నగరంలో పుట్‌పాత్‌లు, పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. అలాగే లింక్ రోడ్లు, పార్కుల అభివృద్ధి వంటి కార్యక్రామాలు జీహెచ్ఎంసీకి మంచి పేరు తీసుకొచ్చాయని అన్నారు.
Advertisement
Next Story