- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఘనంగా 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం..
దిశ, సినిమా: భారతీయ సినిమా రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. కాగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించిన 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరుకాగా.. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విజేతలను అవార్డులతో సత్కరించారు.
రజనీకి విశిష్ట పురస్కారం
సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను విశిష్ట పురస్కారం ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డుతో సత్కరించారు వెంకయ్యనాయుడు. కొన్ని దశాబ్దాలుగా సినీ పరిశ్రమకు రజనీ చేస్తోన్న సేవలకుగానూ కేంద్ర ప్రభుత్వం ఆయనను ఈ పురస్కారంతో గౌరవించింది. ఇక ఒకే ఏడాదిలో తలైవా, ఆయన అల్లుడు ధనుష్ అవార్డులు అందుకోవడంపై అభిమానులు ఖుషీ అవుతున్నారు. కాగా ధనుష్ ఉత్తమ నటుడి విభాగంలో జాతీయ అవార్డును మనోజ్ బాజ్‌పాయితో షేర్ చేసుకున్నారు.
విజేతలు వీరే..
* ఉత్తమ చిత్రం: మరక్కర్ (మలయాళం)
* ఉత్తమ నటుడు: మనోజ్ బాజ్‌పాయి(భోంస్లే), ధనుష్ (అసురన్)
* ఉత్తమ నటి : కంగనా రనౌత్ (మణికర్ణిక)
* ఉత్తమ దర్శకుడు: సంజయ్ పూరన్ సింగ్ చౌహాన్ (బహత్తర్ హూరైన్)
* ఉత్తమ తెలుగు చిత్రం: జెర్సీ
* ఉత్తమ ఎడిటింగ్: నవీన్ నూలి (జెర్సీ)
* ఉత్తమ వినోదాత్మక చిత్రం: మహర్షి
* ఉత్తమ హిందీ చిత్రం: చిచోరే
* ఉత్తమ తమిళ చిత్రం: అసురన్
* ఉత్తమ సహాయ నటి: పల్లవి జోషి (ది తాష్కెంట్ ఫైల్స్)
* ఉత్తమ సహాయ నటుడు: విజయ్ సేతుపతి(సూపర్ డీలక్స్)
* ఉత్తమ యాక్షన్ కొరియోగ్రఫీ: అవనే శ్రీమన్నారాయణ(కన్నడ)
* ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్: మరక్కర్ (మలయాళం)
* ఉత్తమ సంగీత దర్శకుడు (పాటలు): డి. ఇమాన్ (విశ్వాసం)
* ఉత్తమ సంగీత దర్శకుడు (నేపథ్య): ప్రబుద్ధ బెనర్జీ (జ్యేష్టపుత్రో)
* ఉత్తమ మేకప్: రంజిత్ (హెలెన్)
* ఉత్తమ గాయకుడు: బి ప్రాక్ (కేసరి- ‘తేరి మిట్టీ…’)
* ఉత్తమ గాయని: శావని రవీంద్ర (బర్దో-మరాఠీ)
* ఉత్తమ కొరియోగ్రాఫర్: రాజు సుందరం (మహర్షి)