FCI పునరుద్ధరణకు రూ.6120.05 కోట్లు..

by Anukaran |   ( Updated:2020-09-13 02:51:58.0  )
FCI పునరుద్ధరణకు రూ.6120.05 కోట్లు..
X

దిశ, వెబ్‌డెస్క్: రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణకు రూ.6120.05 కోట్లు కేటాయించినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయమంత్రి మాన్ సుఖ్ మాండవ్య తెలిపారు. కర్మాగారానికి అవసరమైన నీటి సరఫరా, విద్యుత్ సరఫరా, గ్యాస్ సరఫరా పనులు ఇప్పటికే పూర్తి చేశామని వెల్లడించారు.

ఈ ఎరువుల ఫ్యాక్టరీలో ప్రతి సంవత్సరం 12.5లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి అయితే, అందులో 6.25లక్షల మెట్రిక్ టన్నుల యూరియా తెలంగాణ రాష్ట్రానికి కేటాయిస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. కాగా, శనివారం కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, మాండవ్య, పలువురు అధికారులు FCIను సందర్శించిన మరుసటి రోజే నిధుల విడుదలకు సంబంధించిన ప్రకటలన వెలువడటం గమనార్హం.

Read Also…

‘సర్వే’పై ఉత్కంఠ.. అందరి ఆశలు దానిపైనే..!

Advertisement

Next Story

Most Viewed