మనందరి ఆనందం కోసం.. డ్యాన్స్ చేసిన డాక్టర్లు

by vinod kumar |
మనందరి ఆనందం కోసం..  డ్యాన్స్ చేసిన డాక్టర్లు
X

దిశ వెబ్ డెస్క్ :
కరోనా పోరులో … తమ ప్రాణాలను అడ్డుపెట్టి.. తమ వారికి దూరంగా ఉంటూ.. దేశ సైనికుల వలే పోరాడుతున్న యోధులు ‘వైద్యులు’. లాక్డౌన్ విధించడంతో పాటు కరోనా మహమ్మారితో యుద్ధం మొదలుపెట్టి మనదేశంలో అప్పుడే నెల గడిచిపోయింది. ప్రజలంతా ఇంట్లో ఉంటే.. వైద్య సిబ్బంది మాత్రం .. కరోనా బాధితుల ప్రాణాలు రక్షించే పనిలో భాగమయ్యారు. కరోనా పై మనదేశం సగం విజయం సాధించింది. ఈ నేపథ్యంలో… ప్రజల్లో ఉత్సాహం నింపేందుకు, వారికి భవిష్యత్తుపై ఆశలు కల్పించేందుకు దేశవ్యాప్తంగా ఉన్న 60 మంది డాక్టర్లు కలిసి ఓ డ్యాన్స్ వీడియో చేశారు. ఆ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ సినీ సెలెబ్రెటీలంతా ఇప్పటికే పాటలు, షార్ట్ ఫిల్మ్ ల రూపంలో కరోనా గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. బుల్లి తెర నటులు కూడా తమ వంతుగా వీడియోలు రూపొందించారు. సినీ రచయితలు తమ కలం పదును చూపించి.. ప్రజల్లో ధైర్యాన్ని నూరిపోశారు. వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ద్య కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు స్వయంగా ఆ డాక్లర్లే ప్రజలకు సంతోషాన్ని పంచేందుకు ఓ వీడియో చేశారు. అమెరికన్ సింగర్, ర్యాపర్, రైటర్ ఫారెల్‌ విలియమ్స్‌ కంపోంజ్ చేసిన ఫేమస్‌ సాంగ్ ‘హ్యాపీ.. హ్యాపీ’కు దేశవ్యాప్తంగా ఉన్న 60 మంది డాక్టర్లు ఒక్కటిగా చేరి డ్యాన్స్‌ చేస్తున్న ఈ వీడియో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. ‘దీ సాంగ్‌ ఆఫ్‌ హోప్‌’ అనే క్యాప్షన్‌తో షేర్‌ చేసిన ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. నెల రోజుల లాక్ డౌన్ పూర్తి చేసుకోవడం తో పాటు, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజల్లో మానసిక స్థైర్యాన్ని అందివ్వడానికి ఈ పాట చేసినట్లు వైద్యులు తెలిపారు. ఈ వీడియోలో ముంబై, బెంగళూరు, చెన్నై, కన్యాకుమారి ఇలా వివిధ రాష్ట్రాలకు చెందిన మొత్తం 60 మంది వైద్యులు పాల్గొన్నారు. అందరూ తమ తమ ఇళ్లలో, ఆసుపత్రుల్లోనే ఉండి ఈ వీడియోను రూపొందించారు. రాహుల్‌ కెడియా ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ.. ‘మీ అందరి మోముల్లో నవ్వులు పువ్వులు పూయించడానికి దేశంలోని యువ డాక్టర్లంతా ఒక్కటిగా చేరారు.అంతేకాదు ఈ కల్లోక పరిస్థితుల్లో మానసిక ఆరోగ్య పరిస్థితి ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాడానికి ఇలా వినూత్న ప్రయత్నం చేశారు’ అంటూ చెప్పుకొచ్చారు.

Tags: corona pandemic, lockdown, doctors, mental health awareness, song of hope, happy happy, pharell williams

Advertisement

Next Story

Most Viewed