మంచు తుఫాన్ బీభత్సం.. ఒకదానికొకటి 100 కార్లు ఢీ

by vinod kumar |
మంచు తుఫాన్ బీభత్సం.. ఒకదానికొకటి 100 కార్లు ఢీ
X

దిశ,వెబ్‌డెస్క్: అమెరికాలో మంచు తుఫాన్ బీభత్సం సృష్టించింది. టెక్సాస్‌ రాష్ట్రం ఫోర్త్‌విత్ సమీపంలో గురువారం ఉదయం.. మంచు తుఫాన్‌తో ఒకదానికొకటి 100 వాహనాలు ఢీ కొన్నాయి. సుమారు ఒకటిన్నర మైళ్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో మైళ్ల కొద్ది ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న సహాయక సిబ్బంది… క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తున్నారు.

మంచు తుఫాన్ కారణంగా ఒకదానికొకటి ఢీ కొన్న వాహనాలు ధ్వంసమయ్యాయి. ఫెడ్‌ఎక్స్‌కు చెందిన ఓ ట్రక్కు అదుపు తప్పి బారియర్‌ను ఢీ కొట్టింది. దీన్ని వెనకే వచ్చిన మరికొన్ని కార్లు ఆ ట్రక్కును ఢీకొని నిలిచిపోవడంతో ఈ ప్రమాదాల పరంపర మొదలైనట్లు భావిస్తున్నారు. జారుడుగా ఉన్న ఆ మార్గంలో రాకపోకలు సాగించేందుకు సహాయక సిబ్బంది సైతం ఇబ్బందులు పడుతున్నారు.

Advertisement

Next Story