- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రపంచ రికార్డు నెలకొల్పిన 6 నెలల బాలుడు
దిశ, వెబ్‌డెస్క్ :
ఆరు నెలల పిల్లోడు.. అప్పుడప్పుడే నిలబడటానికి ట్రై చేస్తుంటాడు, కానీ బలం సరిపోదు. ఆ వయసులో కూర్చోడానికే కాస్త తడబడతారు. ఇక బుడి బుడి నడకలు వేయాలంటే ఇంకొంచెం టైమ్ పడుతుంది. కానీ అమెరికాలోని ఓ ఆరు నెలల పిల్లాడు మాత్రం.. ఏకంగా వాటర్ స్కీయింగ్ సాహసం చేసి ఔరా అనిపించాడు. ప్రపంచంలోనే అత్యంత చిన్న వయస్సులో వాటర్ స్కీయింగ్ చేసిన పిల్లోడిగా రికార్డు సృష్టించాడు
అమెరికా, ఉటా స్టేట్‌కు చెందిన రిచ్ క్యాసీ హంఫరీస్ అనే ఆరు నెలల బాలుడు.. వరల్డ్ రికార్డు సృష్టించాడు. క్యాసీ, మిండి హంఫరీస్ దంపతులకు పుట్టిన ఈ చిన్నోడి సాహసానికి.. నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. లక్షలాది మంది అభినందనలు అందుకుంటున్నాడు. అమ్మానాన్నల పేర్లను కలిపి పెట్టుకున్న ఈ చిన్నోడు.. నిజంగానే వాళ్లిద్దరి పేర్లను నిలబెట్టాడు. ఇటీవల తమ ఇన్‌స్టాగ్రామ్‌లో కొడుకు రిచ్ క్యాసీ హంఫరీస్ వాటర్ స్కీయింగ్ చేస్తున్న ఫొటో, వీడియోను పోస్టు చేశారు. లైఫ్ జాకెట్ వేసుకుని.. స్కియింగ్ బార్స్‌ను పట్టుకుని నీటిపై జామ్ జామ్ అంటూ దూసుకుపోయాడు.
ఇప్పటివరకు ఈ రికార్డు జైలా ఓంగే పేరుపై నమోదై ఉంది. 2016లో ఆరు నెలల 27 రోజుల వయస్సులో ఈ సాహసం చేసి, ప్రపంచంలోనే అత్యంత చిన్న వయస్సులో వాటర్ స్కీయింగ్ చేసిన పసివాడుగా గుర్తింపు పొందాడు. రిచ్.. 6 నెలల 4 రోజుల్లోనే ఈ సాహసం చేయడం గమనార్హం.