- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పండుగ సీజన్‌లో క్రెడిట్ కార్డును వాడే చిట్కాలు
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల క్రెడిట్ కార్డు వినియోగం పట్ల ప్రజల్లో అవగాహన పెరిగింది. ఓ మోస్తరు జీతం ఉంటే చాలు క్రెడిట్ కార్డును వాడేస్తున్నారు. బ్యాంకులు కూడా సులభంగానే వినియోగదారులకు క్రెడిట్ కార్డు సౌకర్యాన్ని అందిస్తున్నాయి. ఇలాంటి సమయాల్లో ఖర్చు చేయడంలో సరైన ప్రణాళిక లేకపోతే నష్టపోవడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చేతిలో నగదు లేని సమయాల్లో నిత్యావసరాలు, లగ్జరీ వస్తువులను కొనడానికి ఎక్కువగా క్రెడిట్ కార్డును ఉపయోగిస్తున్నారు. ఎక్కువగా షాపింగ్ కోసమే దీన్ని వాడుతున్నారు.
సరైన వేళ డబ్బు లేనపుడు క్రెడిట్ కార్డు ద్వారా షాపింగ్ చేసి స్వైప్ చేసేస్తుంటారు. ముఖ్యంగా క్రెడిట్ కార్డు అత్యవసర పరిష్తితుల్లో ఆదుకుంటుందనే భరోసాతో చాలామంది దీన్ని వాడుతుంటారు. పైగా, వివిధ రకాల పేమెంట్లు, మెడికల్ బిల్లులను క్రెడిట్ కార్డుతో సులభంగా చెల్లించవచ్చు. వీటిన్నిటికంటే ఆన్‌లైన్ షాపింగ్ చేయడానికి ఎక్కువమంది వ్యాపారులు క్రెడిట్ కార్డుపైనే తొందరగా ఇస్తున్నాయి. అయితే, ఇందులో కూడా కొన్ని సమస్యలున్నాయని, జాగ్రత్తగా ఉండకపోతే వడ్డీ భారం మోయడం కష్టమవుతుందని, క్రెడిట్ కార్డు వాడే ప్రతీసారి అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రస్తుత పండుగ సీజన్‌లో క్రెడిట్ కార్డును ఉపయోగించకుండా ఎవరూ ఉండలేరు. చాలామంది ఈ పండుగ సీజన్‌లో తమ సామర్థ్యానికి మించి ఖర్చు చేసేస్తుంటారు. తిరిగి చెల్లించే సామర్థ్యం గురించి మర్చిపోతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో పండుగ సీజన్‌కు క్రెడిట్ కార్డు ఉచ్చులో పడకుండా ఉండేందుకు ఈ ఐదు చిట్కాలు మీకు ఉపయోగపడతాయి. అవేంటో తెలుసుకుందాం..!
తిరిగి చెల్లించే సామర్థ్యం..
ముందుగా మీరు క్రెడిట్ కార్డును వాడిన తర్వాత తిరిగి చెల్లించగలరా లేదా అనేది పరిశీలించుకోవాలి. క్రెడిట్ కార్డు బకాయిలను నిర్ణీత సమయానికి చెల్లించకపోతే ఏడాదికి 30-49 శాతం అధికంగా ఉండే ఫైనాన్స్ ఛార్జీల నుంచి తప్పించుకోలేరు. దీనివల్ల మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం పడుతుంది. అంతేకాకుండా భవిష్యత్తులో రుణ సదుపాయాలకు, క్రెడిట్ కార్డు అర్హతకు ఇబ్బందులొస్తాయి. అలాగే, మీ బిల్లులను క్లియర్ చేయకుండా ఉంటే పూర్తి బకాయి క్లియర్ అయ్యేవరకు కొత్త లావాదేవీలపై వడ్డీ లేని చెల్లింపులకు అవకాశముండదు.
ఈఎంఐలను ఎంచుకోండి…
తిరిగి చెల్లించడంలో సమస్యలుంటే గనక, పెద్ద మొత్తం బకాయిలను లేదా అందులోని కొంత భాగాన్ని ఈఎంఐలుగా మార్చుకోవడం ఉత్తమం. ముఖ్యంగా ఎక్కువ మొత్తంలో కొనుగోలు సమయంలో ఇది ఎంతో ఉపయోగపడుతుంది. పైగా, క్రెడిట్ కార్డులను అందించే బ్యాంకుల నుంచి ఈ రకమైన చెల్లింపులపై వడ్డీ రేటు సులభంగా ఉండటమే కాకుండా చెల్లించేందుకు టైం పీరియడ్ ఎక్కువగా ఉంటుంది. అలాగే క్రెడిట్ కార్డు బకాయిలపై ఫైనాన్స్ ఛార్జీల కంటే ఇది చాలా తక్కువగా ఉంటుంది.
నో-కాస్ట్ ఈఎంఐ…
నో-కాస్ట్ ఈఎంఐ వెసులుబాటు ఉంటే దాన్ని ఎంపిక చేసుకోవడం ఉత్తమమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవల క్రెడిట్ కార్డు వాడకం పెరిగిన నేపథ్యంలో ఎక్కువ క్రెడిట్ కార్డు జారీదారులు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండింటిలోనూ వ్యాపారులతో భాగస్వామ్యం ద్వారా నో-కాస్ట్ ఈఎంఐలను అందిస్తున్నాయి. దీనివల్ల వడ్డీ భారాన్ని వ్యాపారులు భరించనుండగా, కార్డుదారులు కొనుగోలు ఖర్చును ఈఎంఐ రూపంలో చెల్లిస్తే సరిపోతుంది.
తక్షణావసరాలకు ప్రీ-అప్రూవ్‌డ్ లోన్ తీసుకోవడం మంచిది..
లావాదేవీల చరిత్రలో మెరుగైన రికార్డు, గతంలో ఉత్తమమైన చెల్లింపుల రికార్డు ఉంటే గనక క్రెడిట్ కార్డుతో సంబంధం లేకుండా ప్రీ-అప్రూవ్‌డ్ లోన్‌ను బ్యాంకులు తొందరగా ఇస్తాయి. ఇవి కార్డుదారుల క్రెడిట్ పరిమితులకు సంబంధం లేకుండా మంజూరవుతాయి. ఈ రుణాలు ముందస్తు అనుమతి పొందినవి కావున, తక్కువ వ్యవధిలో ఖాతాల్లో క్రెడిట్ అవుతాయి. కొన్ని బ్యాంకులు తాము ఎంపిక చేసిన కార్డుదారులకు అదనంగా క్రెడిట్ సదుపాయాలను అందిస్తాయి. ఈ వెసులుబాటు ఉందేమో తెలుసుకోవాలి. ఇలా ప్రీ-అప్రూవ్‌డ్ లోన్‌లను పండుగ ఖర్చుల కోసం వినియోగించవచ్చు. దీంతో ఆర్థిక కొరతను సులభంగా పరిష్కరించవచ్చు.
రివార్డ్ పాయింట్లు…
సాధారణంగా క్రెడిట్ కార్డుకు ఇచ్చే రివార్డ్ పాయింట్లకు వ్యాలిడిటీ ఉంటుంది. క్రెడిట్ కార్డును ఇచ్చే సంస్థలు సరుకులను, సేవలను కొనేందుకు రివార్డ్ పాయింట్లను అందిస్తాయి. ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. ఇది వాస్తవ వ్యయాన్ని అరికట్టేందుకు, ఖర్చును అదుపులో ఉంచేందుకు సహాయపడుతుంది.