‘ఆ రాష్ట్రాలు రూ.5లక్షలు చెల్లించాల్సిందే’

by Shamantha N |

సామూహిక భోజనశాలల ఏర్పాటు పిటిషన్‌పై ఇప్పటివరకు తమ స్పందన తెలియజేయలేని రాష్ట్రాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆకలి సమస్యను పరిష్కరించడానికి దేశవ్యాప్తంగా సామూహిక భోజనశాలలు ఏర్పాటు చేయాలని గతంలో ఓ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై కోర్టు సానుకూలంగా స్పందిస్తూ.. దీనిపై, కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల స్పందన తెలియజేయాలని గతేడాది అక్టోబర్‌లో ఆదేశించింది. అయితే, ఇప్పటివరకూ పంజాబ్, నాగలాండ్, కర్నాటక, ఉత్తరాఖండ్, ఝార్ఖండ్ సహా కేంద్రపాలిత ప్రాంతాలైన అండమాన్ నికోబర్ దీవులు, జమ్మూకశ్మీర్‌లు మాత్రమే అఫిడవిట్లు దాఖలు చేయగా, మిగతా రాష్ట్రాలేవీ చేయలేదు. దీంతో ఆయా రాష్ట్రాలకు 24గంటల గడువు విధిస్తూ, రూ. లక్ష జరిమానా విధించింది. అయినప్పటికీ అఫిడవిట్ దాఖలు చేయడంలో విఫలమైతే, రూ.5లక్షల జరిమానా చెల్లించాల్సి ఉంటుందని జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది.

Advertisement

Next Story

Most Viewed