పెళ్లి వేడుక.. 50మందికి కరోనా!

by vinod kumar |
పెళ్లి వేడుక.. 50మందికి కరోనా!
X

దిశ, వెబ్‌డెస్క్ :

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య మరోసారి పెరిగింది. ఈ విషయాన్ని తాజా హెల్త్ బులెటిన్ ధృవీకరిస్తోంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో పాల్గొన్న 50 మందికి కరోనా సోకింది.

బోధన్ పట్టణ పరిధిలోని చెక్కీ క్యాంపులో 193 ఇళ్లులు ఉండగా.. 42 ఇళ్లలో ఉంటున్న 50 మంది కరోనా బారిన పడ్డారు. వీళ్లలో కొందరు ఆ పెళ్లి వేడుకకు హాజరవ్వగా, మిగతా వారికి కూడా వైరస్ సంక్రమించింది. వీరిలో కొందరు రోజువారీ వ్యాపారం మీద ఆధారపడి బతికే వాళ్లు ఉన్నారు. తమ జీవనోపాధి మీద కరోనా దెబ్బకొట్టిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story