సైన్ లాంగ్వేజ్ టీచింగ్‌లో అతి పిన్న వయస్కుడి రికార్డ్

by Sujitha Rachapalli |
sign-language boy record
X

దిశ, ఫీచర్స్ : హియరింగ్ ఇంపెయిర్డ్ సమస్య ఉన్న వారికి ఏదైనా చెప్పాలంటే ‘సైన్’ లాంగ్వేజ్ ఉపయోగిస్తారని తెలిసిన విషయమే. ఓ ఐదేళ్ల పిల్లాడి గ్రాండ్ పేరెంట్స్ కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నారు. అయితే వారితో మాట్లాడేందుకు ‘సైన్ లాంగ్వేజ్’ నేర్చుకున్న ఆ బుడతడు.. ప్రస్తుతం యూట్యూబ్‌ వేదికగా వేలాదిమందికి ఆ భాషను నేర్పుతున్నాడు.

పిల్లలు పెద్దల అడుగుజాడల్లోనే నడుస్తుంటారు. అలవాట్లు, నడవడిక, సంస్కృతీ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను వారి నుంచే నేర్చుకుంటారు. జోర్డాన్‌కు చెందిన ఎవ్స్ ఉదాహ్(Aws Oudah) కూడా తన తల్లిదండ్రులు, గ్రాండ్ పేరెంట్స్ నుంచి మంచి విషయాలు నేర్చుకునే క్రమంలో ఉన్నాడు. అయితే గ్రాండ్ పేరెంట్స్‌కు వినికిడి లోపం కారణంగా కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ తలెత్తింది. ఈ క్రమంలో సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్న ఆ చిన్నోడు.. తనకు తెలిసిన విద్యను ఇతరులకు నేర్పించాలన్న ఉద్దేశంతో ప్రస్తుతం యూట్యూబ్ వేదికగా ట్యుటోరియల్ వీడియోలు మొదలుపెట్టాడు. దీంతో ఉదాహ్.. జోర్డాన్‌లోనే ‘అతి పిన్న వయస్కుడైన సంకేత భాషా ఉపాధ్యాయుడిగా’ నిలవడంతో పాటు ఇంటర్నెట్ సంచలనంగా మారాడు. ఆ బుడ్డోడి వీడియోలు ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించగా, చానెల్ కూడా తక్కువ వ్యవధిలోనే మంచి పాపులారిటీ సంపాదించింది.

సంకేత భాష నేర్చుకునేందుకు తన కొడుకు చూపించిన అంకితభావం తన బాల్యాన్ని గుర్తుచేస్తోందని ఉదాహ్ తండ్రి తెలపగా.. ‘వినికిడి లోపం ఉన్న వారితో కమ్యూనికేట్ చేయడానికి, ఈ భాషను అందరూ నేర్చుకోవాలనే ఉద్దేశంతో వీడియోలను రూపొందిస్తున్నాను. ఈ లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల వాళ్లంతా ప్రయోజనం పొందుతారని భావిస్తున్నాను’ అని ఉదాహ్ తెలిపాడు.

Advertisement

Next Story

Most Viewed