- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైసీపీ ప్రభుత్వంలో మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు : అచ్చెన్నాయుడు
దిశ, ఏపీ బ్యూరో: హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన టీడీపీ నేతలు లోకేశ్, ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజా, దూళిపాళ్ల నరేంద్రలను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇవి అక్రమ అరెస్టులు అని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. టీడీపీ నేతలను అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. వారు చేసిన తప్పేంటి ? ఎందుకు అరెస్ట్ చేశారు? హత్యకు గురైన దళిత యువతి కుటుంబాన్ని పరామర్శించి వారికి న్యాయం చేయమని ప్రభుత్వాన్ని కోరటమే వారు చేసిన తప్పా? అని నిలదీశారు. పరామర్శకు వెళ్లిన టీడీపీ నేతలను 5 నిమిషాల్లో అరెస్ట్ చేశారు.. రమ్యను చంపిన నిందితుడిని మాత్రం అర్థరాత్రి వరకు పట్టుకోలేకపోయారని పోలీసులపై విమర్శలు గుప్పించారు.
మహిళలకు రక్షణ కల్పించడానికి ఉపయోగపడని పోలీసు వ్యవస్థ టీడీపీ నేతల్ని అరెస్ట్ చేయటంలో మాత్రం సమర్ధవంతంగా పనిచేస్తోందని ధ్వజమెత్తారు. సీఎం జగన్ బాధిత కుటుంబాన్ని పరామర్శించకపోగా పరామర్శకు వెళ్లిన టీడీపీ నేతల్ని అరెస్ట్ చేయించడం సిగ్గుచేటన్నారు. ముఖ్యమంత్రి బాధిత కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదో చెప్పాలని నిలదీశారు. రూ.10 లక్షలిచ్చి చేతులు దులుపుకుంటే రమ్య కుటుంబానికి న్యాయం జరుగుతుందా?అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలపై అఘాయిత్యాలు నిత్యకృత్యమయ్యాయని అచ్చెన్నాయుడు ఆరోపించారు.