Naveen Polishetty: రిలీజ్‌కు ముందే ఓటీటీ పార్ట్‌న‌ర్ ఫిక్స్ చేసుకున్న ‘అనగనగా ఒకరాజు’.. వైరల్ అవుతున్న పోస్ట్

by Prasanna |
Naveen Polishetty: రిలీజ్‌కు ముందే ఓటీటీ పార్ట్‌న‌ర్ ఫిక్స్ చేసుకున్న ‘అనగనగా ఒకరాజు’.. వైరల్ అవుతున్న పోస్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : న‌వీన్ పొలిశెట్టి ( Naveen Polishetty ) హీరోగా న‌టిస్తున్న సినిమా ‘అనగనగా ఒకరాజు’ ( Anaganaga Oka Raju )క‌ళ్యాణ్ శంక‌ర్ డైరెక్షన్ లో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. హీరో న‌వీన్ పొలిశెట్టికి యాక్సిడెంట్ కారణంగా కొన్ని నెలలు షూటింగ్ వాయిదా ప‌డింది.

ఈ సినిమా షూటింగ్ మళ్ళీ పార్రంభం కాగా.. మేకర్స్ టీజ‌ర్‌ను రిలీజ్ చేయగా .. మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ ఏడాదిలోనే ఆడియెన్స్ ముందుకు రాబోతోందంటూ మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే, థియేట‌ర్ల‌లోకి కూడా రాకుండానే ఈ మూవీ ముందే ఓటీటీ పార్ట్‌న‌ర్‌ను ఫిక్స్ చేసుకుంది. నెట్‌ఫ్లిక్స్ ఈ మూవీ ఓటీటీ హ‌క్కుల‌ను ద‌క్కించుకుంది.

ఇక ఇదే విష‌యాన్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. " రాజు పెళ్లి చేసుకోబోతున్నాడు. థియేట‌ర్ల‌లో విడుదలైన తర్వాత '" అనగనగా ఒక రాజు" నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగ‌, త‌మిళం, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ బాష‌ల్లో స్ట్రీమ్ అవుతుందని తెలిపింది. ఈ మేర‌కు ఓ పోస్ట‌ర్‌ను కూడా రిలీజ్ చేసింది. మరి ఈ మూవీతో న‌వీన్ హిట్ కొడతాడో ? లేదో చూడాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed