తెలంగాణకు 5గురు ఐపీఎస్‌ల కేటాయింపు..

by Shamantha N |
తెలంగాణకు 5గురు ఐపీఎస్‌ల కేటాయింపు..
X

దిశ, క్రైమ్ బ్యూరో : తెలంగాణకు కొత్తగా 5 గురు ఐపీఎస్ అధికారులు రానున్నారు. 2019 సివిల్ సర్వీస్ పరీక్షకు ఎంపికై శిక్షణ పూర్తి చేసుకున్న 150 మంది నూతన ఐపీఎస్ అధికారులకు కేంద్ర ప్రభుత్వం బుధవారం పోస్టింగ్‌లను కేటాయించింది.అందులో భాగంగా రాష్ట్రానికి కొత్తగా 5 గురు అధికారులు రానున్నారు.

వీరిలో పరితోష్ పంకజ్ (బీహార్), సిరిశెట్టి సంకీత్ (తెలంగాణ), పాటిల్ కాంతిలాల్ సుభాష్ (మహారాష్ట్ర), అంకిత్ కుమార్ శంక్వార్ (యూపీ), మహేష్ గిద్దె (మహారాష్ట్ర) ఉన్నారు. అదే క్రమంలో ఏపీకి జ‌గ‌దీశ్ అడ‌హ‌ల్లి (క‌ర్ణాట‌క‌), పంక‌జ్ కుమార్ మీనా (రాజ‌స్థాన్‌), ధీర‌జ్ కునుబిల్లి (ఆంధ్ర‌ప్ర‌దేశ్‌)లను కేటాయించారు. ఇదిలాఉండగా, తెలంగాణకు చెందిన ఎంవీ సత్యసాయి కార్తీక్‌ను మహారాష్ట్రకు, షీతల్ కుమార్‌ను అస్సాంకు, రాజనాల స్మృతిక్‌ను ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు కేటాయిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

Next Story

Most Viewed