అక్కడ ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

by Anukaran |
అక్కడ ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
X

ఖనౌజ్: ఘోర ప్రమాదానికి గురై ఐదుగురు మృతిచెందిన ఘటన ఆగ్రా-లాక్నో జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బీహార్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు ఆగ్రా-లక్నో జాతీయ రహదారిపై ఈరోజు ఉదయం మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 18 మందికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed