- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనాతో 45 రోజుల శిశువు మరణం
by vinod kumar |
X
న్యూఢిల్లీ: కేవలం 45 రోజుల వయసున్న శిశువు కరోనావైరస్ కారణంగా మరణించింది. ఢిల్లీలోని కళావతి శరణ్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో ఆ చిన్నారిని ఈ నెల 14న అడ్మిట్ చేశారు. కాగా, రెండు రోజుల తర్వాత ఆ శిశువుకు కరోనా పాజిటివ్‌గా తేలింది. శనివారం ఆ ఆడ శిశువు ప్రాణం కోల్పోయింది. కరోనా వయసుల కతీతంగా అందరికీ వ్యాపిస్తున్నది. శిశువు సహా పండు ముసలివరకు అందరికీ సోకుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నది. ఇంత చిన్న వయసు శిశువుకూ వైరస్ సోకడం.. మరణించడం కలకలం రేపుతున్నది. 45 రోజుల శిశువు ఈ వైరస్ కారణంగా మరణించడం ఇదే మొదటిసారి. కాగా, మూడు రోజుల క్రితం ఇదే ఆస్పత్రిలో 10 నెలల చిన్నారి కొవిడ్ 19తో బాధపడుతూ చేరిందని ఓ వైద్యుడు తెలిపారు.
tags: coronavirus, pandemic, infant, died, infected
Advertisement
Next Story