రేషన్ డీలర్లకు రూ.44.76 కోట్ల కమీషన్ చెల్లింపు: మారెడ్డి

by Shyam |

దిశ, న్యూస్‌బ్యూరో: లాక్‌డౌన్‌లో రేషన్‌కార్డు లబ్దిదారులకు అదనంగా సరఫరా చేసిన బియ్యానికి రేషన్ డీలర్లకు కమీషన్ కింద రూ.44.76 కోట్లు చెల్లించామని పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం ఓ ప్రకటన చేశారు. రేషన్ డీలర్లు ఏప్రిల్, మే నెలల్లో అదనంగా సరఫరా చేసిన బియ్యానికి కిలోకు 70 పైసలు, కంది పప్పుకు 55 పైసలు చొప్పున కమీషన్ చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతినెలా 3లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఉచితంగా సరఫరా చేశామని తెలిపారు. ఈ నెలలో ఉచిత బియ్యం పంపిణీ ప్రక్రియ ముగిసిన తర్వాత జూన్ నెల కమీషన్ కూడా చెల్లిస్తామని తెలిపారు. ఇప్పటివరకు 68.12 లక్షల కుటుంబాలకు 2.74 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేయడం జరిగిందన్నారు. ఏప్రిల్ నెలలో 3.18లక్షల మెట్రిక్ టన్నులకు రూ. 22.27 కోట్లు, మే నెలలో 3.26 లక్షల మెట్రిక్ టన్నులకు రూ. 22.52 కోట్లు, ఏప్రిల్, మే నెలల్లో 4,276 మెట్రిక్ టన్నుల కందిపప్పు పంపిణీకి రూ. 23.52 లక్షలు… మొత్తం రూ. 44.76 కోట్లను రేషన్ డీలర్లకు చెల్లించడం జరుగుతుందని తెలిపారు. ఆన్‌లైన్ ద్వారా నేరుగా రేషన్ డీలర్ల బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed