- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అంగన్‌వాడీ కేంద్రంలో 40పాములు, తేళ్లు
by Shyam |

X
దిశ, వెబ్ డెస్క్ : మహాబూబాబాద్ జిల్లాలోని నెల్లికుదురు మండలంలోని బ్రాహ్మణపల్లి అంగన్ వామీ కేంద్రంలో ఈరోజు ఉదయం 40 పాము పిల్లలు, 2 తేళ్లు కనిపించాయి. పాములు కనిపించడంతో అంగన్‌వాడీ సిబ్బంది, స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే అంగన్‌వాడీ కేంద్రానికి పిల్లలు ఎవరూ రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
చిన్నారులతో పాటు గర్భిణులకు సరకులు పంచేందుకు భవనం తెరవడంతో పాములు కనిపించినట్టు అంగన్‌వాడీ సిబ్బంది పేర్కొన్నారు. శిథిలావస్థలో ఉన్న భవనంలో అంగన్ వాడీ కేంద్రం నడపడం వల్లే ఇలా పాములు, తేళ్లు వస్తున్నాయని సిబ్బంది, స్థానికులు తెలిపారు.
Next Story