మంటల్లో చిక్కి 10 మంది కరోనా పేషెంట్లు మృతి

by Anukaran |   ( Updated:2020-08-09 02:49:05.0  )
మంటల్లో చిక్కి 10 మంది కరోనా పేషెంట్లు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆదివారం తెల్లవారుజామున స్వర్ణ ప్యాలెస్ లో ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ సెంటర్ లో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కి 10 మంది కరోనా పేషెంట్లు మృతిచెందారు.

భయంతో ఫస్ట్ ఫ్లోర్ నుంచి నలుగురు పేషెంట్లు కిందకు దూకేశారు. దీంతో వీరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని భారీగా ఎగిసిపడిన మంటలార్పేశారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, కలెక్టర్ ఇంతియాజ్ తోపాటు సీపీ శ్రీనివాసులు సంఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు.

కాగా, ఇటీవలే ఆ హోటల్ ను కోవిడ్ సెంటర్ గా మార్చి మొత్తం 50 మంది కరోనా పేషెంట్లకు చికిత్స అందిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed