- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బ్లైండ్ డాగ్‌కు 3D హెల్మెట్
దిశ, ఫీచర్స్: అంధులు రోడ్లపై సేఫ్టీగా నడవాలంటే ‘వాకింగ్ స్టిక్’ తప్పనిసరి. ఆ స్టిక్ ఆధారంగా వచ్చే సిగ్నల్స్‌తో ముందుకు వెళుతుంటారు. తోటి మనుషులు రోడ్డు దాటడంలో, ఇతర పనుల్లో వారికి సాయం అందిస్తారు. కానీ, అంధత్వం గల మూగజీవులకు ఇలాంటి పరికరాలు అందుబాటులో లేవు. అందుకు ఓ వ్యక్తి అలాంటి పరికరం రూపొందించాడు. తన బ్లైండ్ డాగ్ కోసం సేఫ్టీ హెల్మెట్ తయారు చేశాడు. ఆ వివరాలు మీ కోసం..
3D ప్రింటింగ్ సాయంతో బొమ్మలు, ఇల్లు, వాహనాలతో పాటు ప్రాణాలు రక్షించే శరీర భాగాలను సృష్టిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఆ క్రమంలో ఓ వ్యక్తి తన కుక్క కోసం 3డి హెల్మెట్ రూపొందించాడు. చాడ్ లాలాండే అనే వ్యక్తికి చెందిన పెంపుడు శునకానికి చూపు లేకపోవడంతో గోడలు, తలుపులను ఢీకొట్టడంతో గాయాలు పాలయ్యేది. దాని బాధలు చూడలేకపోయిన అతను, హెల్మెట్ రూపకల్పన చేశాడు. దాన్ని కుక్క తలకు పెట్టడంతో అది సంతోషంగా ఇంటి చుట్టూ తిరుగుతోందని, గోడలను, ఇతర వస్తువులను ఢీ కొట్టకుండా హెల్మెట్ నిరోధిస్తుందని తెలిపాడు. కుక్క నిద్రపోయే సమయంలో, ఆహారం తినేటప్పుడు దాన్ని తొలగించాలని, మొదట్లో హెల్మెట్ వల్ల తన శునకం ఇబ్బంది పడినా, తర్వాత అలవాటు పడిందని చెప్పాడు. ఈ హెల్మెట్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయొచ్చు. లాలాండే ఇంతకుముందు కూడా శునకాల కోసం పలు పరికరాలను తయారుచేశాడు. తన సోదరి పెట్ డాగ్ సులభంగా నడవడానికి సాయపడేలా ‘సెట్ ఆఫ్ షూస్’, తన తండ్రి పెంచుకుంటున్న కుక్క కోసం డాగీ వీల్ చైర్ రూపొందించాడు.