షాద్‌నగర్‌లో మూడు కంటైన్మెంట్ జోన్లు

by vinod kumar |
షాద్‌నగర్‌లో మూడు కంటైన్మెంట్ జోన్లు
X

దిశ, రంగారెడ్డి: షాద్‌నగర్ పట్టణంలో మూడు ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించబోతున్నట్లు స్థానిక తహసీల్దార్ స్పష్టం చేశారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ఆంక్షలు మొదలయ్యాయి. అక్కడ ఉన్న తాజా పరిస్థితులను శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి సమీక్షించారు. 14 రోజుల‌పాటు గంజ్, మెయిన్ రోడ్ల మీద వ్యాపార లావాదేవీలు నిర్వహించవద్దని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే విజయనగర్ కాలనీకి చెందిన ఓ యువకుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో అతని కుటుంబ సభ్యులైన 20 మందిని, ఆ యువకుడికి వైద్యం చేసిన డాక్టర్, ఆసుపత్రి సిబ్బందిని క్వారంటైన్ చేశారు. తాజాగా ఈశ్వర్ కాలనీకి చెందిన ఓ యువకుడికి కూడా కరోనా లక్షణాలు ఉండటంతో అధికారులు అప్రమత్తయ్యారు. సదరు యువకుడి ఇంటికి 300 మీటర్ల వరకు కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ యువకుడు ఫైనాన్స్ కలెక్షన్ కోసం మెయిన్ రోడ్డులోని షాపులకు తిరిగినట్లు సమాచారం. దీంతో మెయిన్ రోడ్డులోని షాపు‌లను పోలీసులు మూసివేయించారు.

Advertisement

Next Story

Most Viewed