బిగ్ బ్రేకింగ్ : కరీంనగర్‌లో ఒకేసారి 39 మందికి కరోనా..

by Anukaran |
Corona
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : కరీంనగర్ సమీపంలోని ఓ ప్రైవేటు మెడికల్ కాలేజీలో కరోనా మహమ్మారి పంజా విసిరింది. ఇటీవల ఈ మెడికల్ కాలేజీలో వార్షికోత్సవం జరిగిన అనంతరం కొందరు మెడికోలకు కరోనా లక్షణాలు కనిపించడంతో యాజమాన్యం పరీక్షలు నిర్వహించింది.

వీరిలో ఏకంగా 39 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా మరి కొంతమంది విద్యార్థులకు సంబంధించిన పరీక్షల రిపోర్టులు రావాల్సి ఉంది. అయితే, కాలేజీ వార్షికోత్సవం జరిగిన సమయంలో ఎవరూ మాస్కులు ధరించలేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే కరోనా ఒక్కసారిగా పంజా విసిరి ఉంటుందని పలువురు అనుమానిస్తున్నారు. ఇదిలాఉండగా, కరోనా కేసులు వెలుగులోకి రావడంతో యాజమాన్యం మెడికల్ కాలేజీకి సెలవులు ప్రకటించినట్టుగా తెలిసింది.

Advertisement

Next Story

Most Viewed