- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ: మారెడ్డి
దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణ రాష్ట్రం రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా అవతరించబోతుందని పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆరేళ్లలో సాగు విస్తీర్ణం పెంచడంతో ధాన్యం కొనుగోళ్లు 367శాతం పెరిగాయన్నారు. 2014-15 వానకాలం, యాసంగిలో 24లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తే ఈ ఏడాది వానకాలం, యాసంగిలో కలిపి కోటి 12లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. గత యాసంగి కంటే ఈ ఏడాదిలో 28లక్షల మెట్రిక్ టన్నులు అధికంగా కొనుగోలు చేయడం జరిగిందన్నారు.
ఈ ఏడాది యాసంగిలో 6,408 కొనుగోలు కేంద్రాల ద్వారా 9.68లక్షల మంది రైతుల నుంచి రూ.12వేల కోట్ల విలువ చేసే 65లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఇప్పటికే రైతుల ఖాతాలో రూ.11 వేల కోట్లు జమ చేయడం జరిగిందని, మరో రెండు, మూడు రోజుల్లో మిగిలిన మొత్తాన్ని జమ చేస్తామని శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. యాసంగిలో 39లక్షల ఎకరాల్లో వరిపంట సాగు అయితే, అందుకు అనుగునంగా మార్కెట్ వ్యవస్థను బలోపేతం చేసి ధాన్యం కొనుగోళ్లు చేపట్టామన్నారు. 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేస్తే మరో 12లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని రైస్ మిల్లర్లు కొనుగోలు చేశారన్నారు. మరో 15లక్షలు సన్నాలు దిగుబడి కాగా, దాదాపు 6లక్షల మెట్రిక్ టన్నులు విత్తనం కోసం వినియోగించడం జరిగిందన్నారు.