- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కిర్కులో ఇరుక్కు పోయారు
దిశ ప్రతినిధి, నిజామాబాద్: కిర్కులో ఉత్తర తెలంగాణ వారు ఇరుక్కుపోయారు. ఇరాకీ దినార్స్ వేటలో గల్ఫ్ బాట పట్టిన వారు తమ వర్క్ పర్మిట్ వీసా గడువు ముగియడంతో అక్కడి నుంచి ఇండియాకు తిరిగి వచ్చే దారి తెలియక సతమతమవుతున్నారు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న వైరస్ నుంచి తమను తాము కాపాడుకుని తాము పుట్టిన గడ్డకు చేరుతామో లేదోనని ఆందోళన చెందుతున్నారు. యుద్ధక్షేత్రం లాంటి కిర్కులో అంతర్ యుద్ధం జరిగే ప్రాంతంలో వారు దిన దిన గండంగా గడుపుతున్నారు. తాము చేసిన పనికి వేతనాలను యజమానులు ఇవ్వకుండా ఓ వైపు వేదిస్తుంటే, తాము సొంత ప్రాంతానికి వెళ్లడానికి వేలాది డాలర్లు ఎక్కడి నుంచి చెల్లించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కిర్కు అనేది ఇరాక్‌లోని ఓ కీలక ప్రాంతం. ఆ ప్రాంతంపై పట్టుకోసం ఇరాక్ ప్రభుత్వ బలగాలకు అక్కడ కుర్ధిష్ తెగలకు మద్య పోరు నిత్గ్యం జరుగుతుంది. అక్కడ ఉన్న కోకో కోలా కంపెనీలో పని కోసం ఉత్తర తెలంగాణ జిల్లాలైన కరీంనగర్, జగిత్యాల, మంచిర్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, నిర్మల్ జిల్లాకు చెందిన 32 మంది రెండేండ్ల క్రితం వర్క్ వీసాపై వెళ్ళారు. వారు వెళ్లిన తరువాత ఈ ఏడాది కరోనా లాక్ డౌన్ కాలంలో వారి వర్క్ పర్మిట్ పూర్తి అయింది. అప్పుడు లాక్ డౌన్ కారణంగా వారు స్వస్థలాలకు రాలేకపోయారు. అలా అని అక్కడ వారు పని చేయడానికి పర్మిషన్ లేకుండా పోయింది. అక్కడ పనికోసం వెళ్లినప్పుడు కంపెనీ ప్రతినిధులు 32 మందికి సంబంధించిన పాస్ పోర్టులు, వీసా( ఆకామా) లను తీసుకున్నారు. వారికి వర్క్ పర్మిట్ గడువు ముగియడంతో ఒకగదిలో రోజుల తరబడి ఉంటూ బాధలు అనుభవిస్తున్నారు. ఒక్కొక్కరికి ఆరు నెలల వేతనాలు ఇవ్వకుండా కంపెనీ యాజమానులు ఇబ్బందులు పెడుతున్నారని వాపోతున్నారు.
తమను ఇండియాకు పంపించేందుకు రూ 5 నుంచి 12 వేల డాలర్ల ఖర్చు అవుతుందని వాటిని తాము భరించే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఇండియన్ ఎంబసీని సంప్రదిస్తే రేపు మాపు అని సాగదీస్తున్నారని వాపోతున్నారు. ఈ మేరకు ఉత్తర తెలంగాణకు చెందిన 32 మంది కలిసి రెండు వీడియోలను తీసి కుటుంబ సభ్యులకు పంపించారు. వారు ఆ వీడియోలను చూసి తమ వారి పరిస్థితి ఏమవుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు గల్ప్‌లో ఉన్న వారు ముఖ్యంగా అత్యధిక వేతనాలు ధినార్స్ వేటలో ఇరాక్ వెళ్లిన వారి పరిస్థితి తలుచుకుని భయపడిపోతున్నారు. తమ వారిని కిర్కునుంచి రప్పించాలని పాలకులను కోరుతున్నారు. ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.