- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరణ మృదంగం.. ఉమ్మడి జిల్లాలో 32 మంది మృతి
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో కరోనాతో చికిత్స పోందుతూ 32 మంది మృతి చెందడంతో డేంజర్ బెల్స్ మొగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో 22 మంది, కామారెడ్డి ఆసుపత్రిలో 10 మంది మృతి చెందినట్లు తెలిసింది. నిజామాబాద్ జిల్లా అసుపత్రిలో 500 పడకలకు గాను 465 పడకల్లో చికిత్స అందిస్తుండగా 2 వందల మందికి ఆక్సిజన్ ట్రీట్ మెంట్, వెంటిలేటర్ పై మరో 30 మంది చికిత్స పోందుతున్నారు.
కామారెడ్డి జిల్లా అసుపత్రిలో ప్రస్తుతం 93 కోవిడ్ బెడ్స్ ఉండగా, ఇందులో 20 మందికి ఆక్సిజన్ బెడ్లపై చికిత్స కొనసాగుతోండగా జిల్లా మంత్రి ఆదేశాల ప్రకారం జిల్లా ఆస్పత్రిలో 40 ఆక్సిజన్ బెడ్ల కోసం ఏర్పాట్లు జరగుతున్నాయి. మంగళవారం నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 1,215 కొత్త పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. కామారెడ్డిలో 770, నిజామాబాద్‌లో 445 కేసులు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసులు 46,242 కాగా అందులో యాక్టివ్ కేసులు 10వేల వరకు ఉన్నాయి.