- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
'డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్'
దిశ,వెబ్‌డెస్క్: ‘డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్’ పుస్తకపు అట్టను చూసి పుస్తకాన్ని అంచనా వేయొద్దన్నది ఆ సామెత అర్థం. అలాగే మనిషి రూపును చూసి వారెలాంటివారో చెప్పడం కూడా చాలా కష్టం. అందుకు ప్రత్యక్ష ఉదాహరణే ఢిల్లీకి చెందిన దీక్షా ఛబ్రా. సాధారణంగా మగవాళ్లైనా, ఆడవాళ్లైనా పెళ్లైన తర్వాత ఏం చేయలేరని, అందులో కఠిన నిర్ణయాలు అసలు తీసుకోలేరని అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. కానీ దీక్ష అలా కాదు. చేయగలమనే దృఢ సంకల్పం ఉంటే ఎన్ని అవాంతరాలు ఎదురైనా సాధిస్తామని నిరూపించింది.
2015 డిసెంబర్‌లో దీక్ష తన కాలేజీలో జరిగే పూర్వ విద్యార్ధుల సమావేశానికి ఆర్మీలో పనిచేస్తున్న తన భర్తతో అటెండ్ అయ్యింది. ఈ సమావేశానికి దీక్ష స్నేహితులు కూడా వచ్చారు. అయితే 29ఏళ్ల వయస్సులో 96 కేజీలున్న ఆమెను చూసి.., ఆమె స్నేహితులు సూటి పోటి మాటలతో అవహేళన చేశారు.
తాను చదివిన కాలేజీలో ఎన్‌సీసీ క్యాడెట్, మంచి క్లాసికల్ డ్యాన్సర్ గా పేరున్న దీక్షను తోటీ స్నేహితులు బాడీ షేమింగ్ పై కామెంట్ చేస్తూ నీకంటే నీభర్తే బాగున్నాడన్న స్నేహితుల మాటల్ని విని తట్టుకోలేకపోయింది. ఆ రాత్రి బాడీ షేమింగ్ పై కామెంట్స్ గుర్తుకు వచ్చి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచింది. అందుకు కారణంగా కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలేనని గతాన్ని గుర్తు చేసుకున్నారు. అప్పటికే ఐదేళ్ల బాబుకి తల్లిగా, స్కూల్ ప్రిన్సిపల్ గా విధులు నిర్వహిస్తుంది. అదే సమయంలో ఆమె అత్తకి క్యాన్సర్ అటాక్ అయ్యింది. దీంతో ఇంట్లో పని, ఆఫీస్ లో పని ఒత్తిడితో పీసీఓడీకి గురై విపరీతంగా బరువుపెరిగింది. పీసీఓడీ తో పాటు స్నేహితుల అవహేళ ఆమెను మరింత కుంగదీసింది.
అయితే అదృష్టవశాత్తూ మరుసటి ఏడాదిలో ఆర్మీలో పనిచేస్తున్న భర్తకి సిక్కీం ట్రాన్స్ ఫర్ కావడంతో ఆమె కుటుంబం కూడా షిఫ్ట్ అయ్యింది. అక్కడికి వెళ్లిన నాటి నుంచి తనను తాను పూర్తిగా మార్చుకునేందుకు ప్రయత్నించింది. బరువు పెరుగుతున్నానే కారణంతో అన్నం తినకుండా కడుపు మాడ్చుకుంది. పస్తులుంది. అలా నెలల వ్యవధిలో ఏకంగా 18 కిలోలు బరువు తగ్గింది. కానీ ఆమెకు అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. ఆమె స్కిన్ వదులుగా వికారంగా మారింది.
డాక్టర్ల సలహా మేరకు మెల్లమెల్లగా ఆరోగ్యంపై దీక్ష పట్టుసాధించింది. తినే ఆహారంలో ప్రొటీన్స్ ను యాడ్ చేసింది. జిమ్ లో చేరి చర్మం స్టిఫ్ గా ఉండేందుకు శిక్షణ తీసుకుంది. కొవ్వును తగ్గించి, కండరాలు మెలితిరేగాల ప్రాక్టీస్ చేసింది. అలా మరో 12 కేజీలు తగ్గించుకొని నాజూగ్గా మారింది. 2017లో ఆమె ఫొటోల్ని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయడంతో నెటిజన్లు న్యూట్రీషన్ గా, జిమ్ ట్రైనర్ గా క్లాసులు నిర్వహించాలని రిక్వెస్ట్ లు రావడంతో సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసింది.
31ఏళ్ల వయస్సులో తన 7ఏళ్ల కొడుకుతో జరిగిన ఇండియా ఎర్త్ – 2017 బ్యూటీ సెగ్మెంట్ లో విజయం సాధించింది. ప్రస్తుతం ఆమె టాప్ న్యూట్రీషిన్లలో ఒకరుగా కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒక వ్యక్తి ఆకారాన్ని తక్కువగా అంచన వేయకూడదు. పీసీఓడీతో బాధపడే తాను సంవత్సరంలో 200 అంతకంటే ఎక్కువమందికి న్యూట్రీషన్ గా పనిచేశాను. మనం ఏది మనస్పూర్తిగా కోరుకుంటామో అదే జరుగుతుంది. కానీ అందుకు ఓర్పు, సహనం చాలా అవసరం. చేసే పనివల్ల రాత్రి రాత్రే ఫలితాలు రావు. కానీ ఎప్పటికైనా మనం అనుకున్నది సాధిస్తామని చెబుతోంది దీక్షా ఛబ్రా.