- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దిశ ఎఫెక్ట్.. జిల్లాకు 3 వేల రాపిడ్ టెస్ట్ కిట్లు
దిశ ప్రతినిధి, నిజామాబాద్: టెస్టు కిట్లు ఓడుస్తున్నాయి అనే పెరుతో గురువారం‘దిశ’లో వచ్చిన కథనానికి స్పందన లభించింది. జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ర్యాపిడ్ యాంటి జెన్ కిట్ల ఓడిసినాయి, పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేదని వచ్చిన కథనానికి స్పందనగా జిల్లాకు 3 వేల కిట్లు వచ్చాయి. గురువారం నిజామాబాద్ జిల్లాకు అవసరమైన 3వేల ర్యాపిడ్ టెస్ట్ కిట్లు, అత్యవసర మందులు 400 వందల స్ట్రిప్పుల ఫావిల్యూ టాబ్లెట్స్,125 రెమెడిసివిర్ వాయిల్స్ ఇంజెక్షన్లు హైదరాబాద్ సరోజిని దేవి హాస్పిటల్ నుంచి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తన సొంత వాహనంలో జిల్లాకు పంపించారు. జిల్లాకు కరోనా టెస్ట్ కిట్లు, అత్యవసర మందులు అవసరమని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి మంత్రి దృష్టికి తీసుకురాగా, మంత్రి శ్రద్ధ తీసుకొని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, ఆరోగ్య శాఖ అధికారులతో మాట్లాడి జిల్లాకు అవసరమైన టెస్టు కిట్లు, మందులు పంపేలా చర్యలు చేపట్టారు. తన సొంత వాహనంలో వ్యక్తిగత సిబ్బందిని ఇచ్చి నిజామాబాద్‌కు అతవసర కిట్లు, ఇంజెక్షన్లు, టాబ్లెట్స్ పంపించారు.