సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు: ప్రదీప్

by Shyam |
సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు: ప్రదీప్
X

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా తెరకెక్కిన ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా’ చిత్రాన్ని పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్ చెప్పింది మూవీ యూనిట్. జనవరి 29న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన సినిమా భారీ ఓపెనింగ్స్ సాధించి..యునానిమస్‌గా సూపర్ హిట్ సొంతం చేసుకుందని తెలిపారు. ప్రతి సీన్, ప్రతి పాటకూ ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన వస్తోందన్న హీరో ప్రదీప్.. మున్నా అనుకున్న కథకి, సిచ్యువేషన్స్‌కి తగ్గట్లుగా అనూప్ బ్యూటిఫుల్ మ్యూజిక్ అందించగా..సంగీతం సినిమాకు ప్రాణం పోసిందన్నారు.

నిర్మాత ఎస్వీ బాబు దర్శకుడిపై, తనపై నమ్మకంతో సినిమా చేశారని.. ఓవర్ సీస్, ఆంధ్ర, తెలంగాణ ఏరియాల్లోనూ మంచి ఓపెనింగ్స్ రావడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ చిత్రాన్ని డబ్బు ప్రధానంగా కాకుండా ఇష్టంగా చేశానన్న నిర్మాత ఎస్వీ బాబు.. ఈ సినిమా మీదే డైరెక్టర్ మున్నా, హీరో ప్రదీప్ జీవితాలు ఆధారపడటంతో థియేటర్స్‌లోనే సినిమా రిలీజ్ చేశానన్నారు. ప్రేక్షకులు ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Next Story