- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కరోనాతో నర్సు మృతి.. మరో 30 మంది రిజైన్
దిశ, న్యూస్ బ్యూరో: అనారోగ్య కారణంతో పాటు కరోనా బారిన పడి చనిపోయిన ఒడిషా రాష్ట్రానికి చెందిన నర్సులు మరికొంత మంది ఆసుపత్రి యాజమాన్యం తీరుపై నిరసన వ్యక్తం చేశారు. సికింద్రాబాద్‌లోని ఒక కార్పొరేటు ఆసుపత్రిలో పనిచేస్తున్న ఒడిషా రాష్ట్రానికి చెందిన నర్సు ఇటీవల కరోనాబారిన పడి చికిత్స ఫలించక చనిపోతే ఆమెకు కరోనా లేదంటూ డెత్ సర్టిఫికెట్ జారీ చేసి బంధువులకు మృతదేహాన్ని అప్పగించి సొంతూరుకి తరలించే ఏర్పాట్లు చేయడాన్ని అదే రాష్ట్రానికి తోటి నర్సులు అభ్యంతరం వ్యక్తం చేశారు. యాజమాన్యం బాధ్యతారాహిత్యంతో వ్యవహరించిందని, ఉద్దేశపూర్వకంగానే నిబంధనలను తుంగలో తొక్కిందని నర్సులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
కరోనా చికిత్స చేసిన తర్వాత కూడా ఆమెకు కరోనా లేదంటూ సర్టిఫికెట్ ఇచ్చి మృతదేహాన్ని బంధువులకు అప్పజెప్పి యాజమాన్యం చేతులు దులుపుకుందని, భవిష్యత్తులో తమకు కూడా ఏదైనా జరిగితే ఇలానే వ్యవహరిస్తారన్న అనుమానంతో ఒకేసారి 30 మంది నర్సులు (వీరంతా ఒడిషా రాష్ట్రానికి చెందినవారు) రాజీనామా చేశారు. శుక్రవారం నుంచి విధులకు హాజరుకావడంలేదు. సొంతూళ్ళకు వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. వీరి రాజీనామాకు ఆసుపత్రి యాజమాన్యం ఒప్పుకోకపోయినా ఒత్తిడి చేసి మరీ ఆమోదింపజేసుకున్నారు. అసలే నర్సులకు కొరత ఉన్న సమయంలో ఒక్కసారిగా 30 మంది మానేసి వెళ్ళిపోతే మిగిలిన నర్సుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని యాజమాన్యం ఆందోళనలో ఉంది.