- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐపీఓ ద్వారా రూ. 45 వేల కోట్లు సేకరించనున్న కంపెనీలు ఇవే..
దిశ, వెబ్‌డెస్క్: ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ మధ్య కాలంలో ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్(ఐపీఓ) ద్వారా నిధులు సేకరణ భారీ మొత్తంలో జరగనుందని తెలుస్తోంది. దాదాపు 30 కంపెనీలు ఐపీఓ ప్రక్రియ ద్వారా రూ. 45,000 కోట్లకు పైగా నిధులను సమీకరించనున్నట్టు మర్చంట్ బ్యాంకింగ్ వర్గాలు వెల్లడించాయి. టెక్ ఆధారిత కంపెనీలు ఇందులో భారీ మొత్తం సమీకరించనున్నాయి. ఇక, ఇప్పటికీ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ఐపీ ద్వారా ఏకంగా 38 రెట్లు ఎక్కువగా సబ్‌స్క్రైబ్ అయింది. దీంతో కొత్త కంపెనీలు ఐపీఓకు వచ్చేందుకు దోహదపడింది.
జొమాటో ఐపీఓ విజయవంతం కావడంతో కొత్త టెక్ కంపెనీలకు ఐపీఓ ద్వారా నిధుల సమీకరణకు మార్గం ఏర్పడిందని ఏంజెల్ వన్ డిప్యూటీ ప్రెసిడెంట్ జ్యోతి రాయ్ అన్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ నుంచి నవంబర్ మధ్య కాలంలో ఐపీఓ నిర్వహణ ద్వారా పాలసీబజాజ్ రూ. 6,017 కోట్లు, ఎంక్యూర్ ఫార్మా రూ. 4,500 కోట్లు, నైకా రూ. 4,000 కోట్లు, సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ రూ. 2,000 కోట్లు, మొబిక్విక్ రూ. 1,900 కోట్లను సేకరించనున్నాయి. వీటితో పాటు మరో పాతిక వరకు కంపెనీలు నిధుల సేకరణకు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుత ఏడాదిలో ఇప్పటివరకు 40 కంపెనీ రూ. 64 వేల కోట్లకు పైగా నిధులు సేకరించాయి.