ఆ చిన్నారుల కుటుంబాలకు పరిహారం

by srinivas |   ( Updated:2020-10-28 11:33:28.0  )
ఆ చిన్నారుల కుటుంబాలకు పరిహారం
X

దిశ, ఏపీ బ్యూరో: పశ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడు మండలం వసంతవాడ వాగులో పడి ఆరుగురు చిన్నారులు మృతిచెందిన ఘటనపై ప్రభుత్వం స్పందించింది. విషాద ఘటనను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని సీఎం జగన్‌‌ దృష్టికి తీసుకెళ్లగా.. రాష్ట్ర ప్రభుత్వం ఆరుగురు చిన్నారుల కుటుంబాలకు రూ.3లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని మంత్రి భరోసానిచ్చారు. ఆరుగురు చిన్నారులు మృతిచెందడంతో కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

Advertisement

Next Story