హై స్పీడ్‌లో కారును ఢీకొన్న లారీ.. ముగ్గురు మృతి.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో

by Sumithra |
mumabi-Accident
X

దిశ, వెబ్‌డెస్క్ : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముంబై భోర్‌ఘాట్‌లోని ముంబై-పూణే జాతీయ రహదారిపై ఓ లారీ అతి వేగంగా వచ్చి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. మరణించిన వారిలో నాలుగేళ్ల బాలుడు ఉండటం మరింత విషాదాన్ని నింపింది. లారీ వేగంగా ఢీకొనడంతో ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed