దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు.. కొత్తగా ఎన్ని కేసులంటే ?

by vinod kumar |
carona 1
X

దిశ, వెబ్ డెస్క్: భారత్ లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు విడుదల చేసిన బులిటెన్ ప్రకరారం.. దేశంలో నిన్న కొత్తగా 2,81,386 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,49,65,463కు చేరింది. ఇక కరోనాతో నిన్న 4,106 మంది మరణించగా అదే సమయంలో కరోనాతో 3,78,741 మంది కోలుకున్నారు. దేశంలో ఇప్పటి వరకు కరోనాతో 2,74,390 మంది మృతిచెందారు. ఇక ప్రస్తుతం దేశంలో 35,16,997 యాక్టివ్ కేసులున్నాయి. ఇందులో కొంత మంది హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతుండగా, మరికొందరు ఆసుపత్రిలలో చికిత్స పొందుతున్నారు.

Advertisement

Next Story