- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
24 గ్రహాలు జీవరాశికి అనుకూలం
– భూమి కంటే మెరుగైన వసతులు
దిశ, వెబ్‌డెస్క్: మానవాళి మనుగడకు అనుకూలమై న భూమి లాంటి గ్రహం కోసం శాస్త్రవేత్తల అన్వేషణ ఫలించిం ది. భూమి లాంటి కాదు.. భూమిని మించిన గ్రహాలను.. వీటిలో జీవరాశి వృద్ధికి భూమి కన్నా మెరుగైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయని కనుగొన్నా రు. వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ అధ్యయనంలో పరిశోధకులు ఈ గ్రహాలను గుర్తించారు. ఈ అధ్యయన వివరాలను ఆస్ట్రాలజీ వెబ్ జర్నల్ ప్రచురించింది. భూమికి వంద కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ గ్రహాలు భూమి కన్నా పురాతనమైనవి, పెద్దవి. అదీ ఏకంగా 24 గ్రహాలను గుర్తించారు. అక్కడ భూమి కన్నా కొద్దిగా వేడి వాతావరణం ఉండడంతో పాటు తేమ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ గ్రహాల కక్ష్యకు సంబంధించిన నక్షత్రాలు మన సూర్యుడి కన్నా మెరుగ్గా ఉన్నాయని, వీటి జీవితకాలం కూడా సూర్యుడి కన్నా అధికమని పరిశోధకులు పేర్కొన్నారు. వీటిలో జీవరాశి చాలా సులభంగా వృద్ధి చెందుతుందని వారు భావిస్తున్నారు. నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు భవిష్యత్తులో చేయబోయే పరిశోధనలకు ఈ అధ్యయనం మరింత ఊతమిస్తుందని వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్త షల్జు మకుచ్ పేర్కొన్నారు.