తెలంగాణలో భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు..

by Shyam |   ( Updated:2021-04-11 22:40:07.0  )
తెలంగాణలో భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు..
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా మరో 2,251 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనాతో మరో ఆరుగురు మృతి చెందినట్టు వైద్య ఆరోగ్యశాఖ తాజా బులిటెన్‌లో పేర్కొంది. తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం 3,29,529 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనాతో 1,765 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం తెలంగాణలో 21,864 యాక్టివ్ కేసులు ఉన్నాయి. హైదరాబాద్‌లో 355, మేడ్చల్ 258, నిజామాబాద్ జిల్లాలో 244 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

Advertisement

Next Story