2027 నాటికి భారత్‌లో పూర్తిగా ఎలక్ట్రిక్ టూ-వీలర్ వాహనాలు : హీరో!

by Harish |   ( Updated:2021-09-22 05:55:50.0  )
Naveen Munjal
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ)కు మారడాన్ని వేగవంతం చేసేందుకు దేశీయ అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో 2027 నాటికి పూర్తిగా గ్యాసోలిన్ ఆధారిత టూ-వీలర్ల అమ్మకాలని నిలిపేయనుంది. ఎలక్ట్రిక్ వాహనాలకు మారడంతో మనం చైనా కంటే వెనకబడి ఉన్నామని, అధిక ధరలు, ఛార్జింగ్ మౌలిక సదుపాయాల కొరత వల్ల ఆలస్యమవుతోందని హీరో ఎలక్ట్రిక్ సంస్థ అభిప్రాయపడింది. అంతర్జాతీయంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలో చైనా 97 శాతం వాటాను కలిగి ఉండగా, భారత్ మొత్తం అమ్మకాల్లో 1 శాతం కంటే తక్కువగా ఈవీ టూ-వీలర్లను విక్రయిస్తోంది. ‘మరో ఆరేళ్లలో వంద శాతం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విక్రయాలు నమోదవనున్నాయని’ హీరో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నవీన్ ముంజల్ అన్నారు.

ఎలక్ట్రిక్‌కి మారాలని నిర్ణయించుకునే లక్ష్యాలు ఏర్పడిన తర్వత కంపెనీలు సరఫరా వ్యవస్థ, నైపుణ్యం, మౌలిక సదుపాయాల అవసరాలు, ఆర్థిక చిక్కులకు సంబంధించి ప్రణాళికలను ఏర్పరచుకుంటాయని ఆయన వివరించారు. హీరో ఎలక్ట్రిక్ సంస్థ తన మొదటి ఈ-స్కూటర్‌ను 2022, మార్చిలో విడుదల చేస్తాం. వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 5 లక్షల యూనిట్లకు విస్తరించేందుకు సంస్థ రూ. 700 కోట్ల పెట్టుబడులు పెట్టాలని భావిస్తోంది. అలాగే, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు దేశవ్యాప్తంగా ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తోంది. ఎగుమతుల ద్వారా ప్రపంచ మార్కెట్‌లో ఉనికిని విస్తరించనున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed