ICC World Cup 2023: ఇండియా ఓటమిపై స్పందించిన నరేంద్ర మోదీ

by Prasanna |   ( Updated:2023-11-23 13:59:45.0  )
ICC World Cup 2023: ఇండియా ఓటమిపై స్పందించిన నరేంద్ర మోదీ
X

దిశ,వెబ్ డెస్క్: దేశమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఇండియాపై ఆస్ట్రేలియా గెలుపొందింది. వరుసగా 10 మ్యాచ్ లు గెల్చుకుంటూ వెళ్లిన టీమిండియా ఫైనల్ లో ఓటమిపాలైంది. ఈ సారి ఎలా అయినా కప్పు కొట్టుకువస్తారని అందరూ ఆశ పడ్డారు. కానీ నిరాశే ఎదురైంది. కాగా.. ఇండియా ఓటమిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు.

"ప్రియమైన టీమిండియా.. ప్రపంచకప్‌- 2023లో మీ ప్రతిభ, సంకల్పం మెచ్చుకోదగినవి. మీరు గొప్ప స్ఫూర్తితో ఆడారు. మీ ఆటతో దేశం గర్వపడేలా చేశారు. ఓడినా సరే మీకు తోడుంటాం. ఇప్పుడే కాదు ఎల్లప్పుడూ మేమంతా మీ వెంట ఉంటాం." అంటూ నిరాశలో ఉన్న టీమిండింయాకు ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా ఓదార్పునిచ్చారు.అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగ్గా.. ఛాంపియన్లయిన ఆస్ట్రేలియాకు ఆ దేశ డిప్యూటీ ప్రధానితో కలిసి కప్ అందించారు. ఆసీస్‌ టీంకు తన శుభాకాంక్షలు తెలిపారు. ఒక్కో ఫ్లేయర్ దగ్గరికి వెళ్లి అభినందించారు ప్రధాని మోదీ.

Advertisement

Next Story