ICC World Cup 2023: బంగ్లాదేశ్‌ చిత్తు.. హ్యాట్రిక్‌ కొట్టిన కివీస్‌..

by Vinod kumar |   ( Updated:2023-10-14 13:01:15.0  )
ICC World Cup 2023: బంగ్లాదేశ్‌ చిత్తు.. హ్యాట్రిక్‌ కొట్టిన కివీస్‌..
X

దిశ, వెబ్‌డెస్క్: ICC World Cup 2023లో భాగంగా చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో ICC World Cup 2023లో న్యూజిలాండ్‌ హ్యాట్రిక్‌ విజయం నమోదు చేసింది. ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌ను మట్టికరిపించిన కివీస్‌.. రెండో మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను చిత్తు చేసింది. తాజాగా బంగ్లాదేశ్‌తో శుక్రవారం నాటి మ్యాచ్‌లోనూ జయభేరి మోగించింది. న్యూజిలాండ్ బ్యాటర్స్‌లో.. డారిల్ మిచెల్ (89) నాటౌట్‌గా నిలవగా.. కేన్ విలియమ్సన్ (78), డెవాన్ కాన్వే (45) పరుగులతో రాణించారు. బంగ్లాదేశ్ నిర్ధేశించిన 245 రన్స్ లక్ష్యాన్ని.. న్యూజిలాండ్ 42.5 ఓవర్‌ల్లో 2 వికెట్లు కోల్పోయి 248 పరుగులు చేసింది.

అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ స్వల్ప స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్‌లకు 9 వికెట్లు కోల్పోయి 245 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బ్యాటర్స్‌లో.. ముష్ఫికర్ రహీమ్ (66) టాస్ స్కోరర్‌గా నిలవగా.. మిగిలిన బ్యాటర్స్.. షకీబ్ అల్ హసన్ (40), మెహిదీ హసన్ మిరాజ్ (30), మహ్మదుల్లా (41) పరుగులతో రాణించారు. న్యూజిలాండ్‌ బౌలర్‌లో.. లాకీ ఫెర్గూసన్ 3, ట్రెంట్ బౌల్ట్ 2, మాట్ హెన్రీ 2 వికెట్లు తీయగా.. మిచెల్ సాంట్నర్, గ్లెన్ ఫిలిప్స్ చెరో వికెట్ పడగొట్టారు.

Advertisement

Next Story