ICC World Cup 2023: సెంచరీతో చెలరేగిన స్టోక్స్.. నెదర్లాండ్స్ ఎదుట భారీ టార్గెట్

by Vinod kumar |   ( Updated:2023-11-08 13:04:01.0  )
ICC World Cup 2023: సెంచరీతో చెలరేగిన స్టోక్స్.. నెదర్లాండ్స్ ఎదుట భారీ టార్గెట్
X

దిశ, వెబ్‌డెస్క్: ICC World Cup 2023లో భాగంగా పూణె వేదికగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ భారీ స్కోరు చేసింది. ఇంగ్లీష్‌ జట్టు ఓపెనర్‌ డేవిడ్‌ మలన్‌ (74 బంతులలో 87, 10 ఫోర్లు, 2 సిక్సర్లు), స్టార్‌ ఆల్‌ రౌండర్‌ బెన్‌ స్టోక్స్ (84 బంతుల్లో 108, 6 ఫోర్లు, 6 సిక్సర్లు) సెంచరీతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 339 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆఖర్లో క్రిస్‌ వోక్స్‌ (45 బంతుల్లో 51, 5 ఫోర్లు, 1 సిక్స్‌) మెరుపులతో ఇంగ్లండ్‌ భారీ స్కోరు చేయగలిగింది. డచ్‌ బౌలర్లలో లీడె 3 వికెట్లు తీయగా.. వాన్‌ బీక్‌, ఆర్యన్‌ దత్‌లు తలా 2 వికెట్లు పడగొట్టారు.

Advertisement

Next Story

Most Viewed