ICC World Cup 2023: బంగ్లాదేశ్ స్వల్ప స్కోరు.. న్యూజిలాండ్‌ టార్గెట్ ఇదే

by Vinod kumar |   ( Updated:2023-10-13 12:26:41.0  )
ICC World Cup 2023: బంగ్లాదేశ్ స్వల్ప స్కోరు.. న్యూజిలాండ్‌ టార్గెట్ ఇదే
X

దిశ, వెబ్‌డెస్క్: ICC World Cup 2023లో భాగంగా చెన్నై వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ స్వల్ప స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్‌లకు 9 వికెట్లు కోల్పోయి 245 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బ్యాటర్స్‌లో.. ముష్ఫికర్ రహీమ్ (66) టాస్ స్కోరర్‌గా నిలవగా.. మిగిలిన బ్యాటర్స్.. షకీబ్ అల్ హసన్ (40), మెహిదీ హసన్ మిరాజ్ (30), మహ్మదుల్లా (41) పరుగులతో రాణించారు. న్యూజిలాండ్‌ బౌలర్‌లో.. లాకీ ఫెర్గూసన్ 3, ట్రెంట్ బౌల్ట్ 2, మాట్ హెన్రీ 2 వికెట్లు తీయగా.. మిచెల్ సాంట్నర్, గ్లెన్ ఫిలిప్స్ చెరో వికెట్ పడగొట్టారు.

Advertisement

Next Story