ICC World Cup 2023: డికాక్ సెంచరీ.. భారీ స్కోరుపై కన్నేసిన సౌతాఫ్రికా

by Vinod kumar |   ( Updated:2023-10-16 05:08:37.0  )
ICC World Cup 2023: డికాక్ సెంచరీ.. భారీ స్కోరుపై కన్నేసిన సౌతాఫ్రికా
X

దిశ, వెబ్‌డెస్క్: ICC World Cup 2023లో భాగంగా ఇవాళ లక్నోలోని అటల్ బిహారీ స్టేడియంతో ఆసీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ సెంచరీ చేశాడు. World Cup 2023లో వరుసగా రెండు సెంచరీలు చేశారు. ఈ మ్యాచ్‌లో డికాక్.. 100 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లుతో 107 పరుగులు చేశాడు. డికాక్‌ సిక్సర్ బాది వన్డేల్లో 19వ శతకం పూర్తి చేసుకున్నాడు.

తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై 400కుపైగా స్కోరు చేసిన సౌతాఫ్రికా.. ఆసీస్‌పై కూడా భారీ స్కోరు చేసేలా కనిపిస్తోంది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా 30 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. మరో ఓపెనర్ తెంబా బావుమా (35; 55 బంతుల్లో 2 ఫోర్లు), వన్‌డౌన్‌ బ్యాటర్‌ వాండర్‌ డసెన్ (26; 30 బంతుల్లో 2 ఫోర్లు) పరుగులు చేశారు. మార్‌క్రమ్‌ (2*) క్రీజులో ఉన్నాడు.

Advertisement

Next Story

Most Viewed