ICC World Cup 2023: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ప్రతి ఒక్క స్టేడియంలో అది 'ఫ్రీ'..

by Vinod kumar |   ( Updated:2023-10-05 16:03:21.0  )
ICC World Cup 2023: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ప్రతి ఒక్క స్టేడియంలో అది ఫ్రీ..
X

దిశ, వెబ్‌డెస్క్: క్రికెట్ ఫ్యాన్స్ కోసం బీసీసీఐ స్పెషల్ అనౌన్స్‌మెంట్ చేసింది. 2023 ప్రపంచకప్ మ్యాచ్‌లు చూడడం కోసం స్టేడియాలకి వచ్చే ప్రేక్షకులకు మినరల్ వాటర్ ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. భారత క్రికెట్ అభిమానులందరికీ ఉచిత మినరల్, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌ను అందజేస్తుందని బీసీసీఐ సెక్రటరీ జయ్ షా ప్రకటించారు. "వన్డే ప్రపంచ కప్ సమరం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఒక కీలక ప్రకటన చేస్తున్నా.. వరల్డ్ కప్ మ్యాచులు జరిగే ప్రతి స్టేడియంలో ఫ్రీగా మినరల్ వాటర్ అందిస్తాం. అభిమానులని మ్యాచులను చూసి ఎంజాయ్ చేయండి". అని ట్విట్టర్ వేదికగా జైషా ప్రకటించాడు

ప్రపంచకప్ 2023కి భారత్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. భారత్‌లోని మొత్తం 10 మైదానాల్లో ఈ మ్యాచ్‌లు జరగబోతున్నాయి. అందులో నరేంద్ర మోడీ స్టేడియం, మోటేరా (అహ్మదాబాద్), M చిన్నస్వామి స్టేడియం(బెంగళూరు), MA చిదంబరం స్టేడియం(చెన్నై), అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం(ఢిల్లీ), హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం(ధర్మశాల), భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియం( లక్నో), రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం(హైదరాబాద్), మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం(పుణె), ఈడెన్ గార్డెన్స్(కోల్‌కతా), వాంఖడే స్టేడియం(ముంబై) ఉన్నాయి.

Advertisement

Next Story