ICC World Cup 2023: చెలరేగిన సౌతాఫ్రికా బౌలర్లు.. ఆసీస్‌కు ఘోర పరాభవం

by Vinod kumar |
ICC World Cup 2023: చెలరేగిన సౌతాఫ్రికా బౌలర్లు.. ఆసీస్‌కు ఘోర పరాభవం
X

దిశ, వెబ్‌డెస్క్: ICC World Cup 2023లో భాగంగా ఆసీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. 134 రన్స్ భారీ తేడాతో జయకేతనం ఎగరేసింది. 312 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. 177 పరుగులకే అలౌట్ అయింది. ఆసీస్ బ్యాటర్స్‌లో.. మార్నస్ లబుషేన్‌(46) టాస్ స్కోరర్‌గా నిలవగా.. మిగిలిన బ్యాట్స్‌మెన్స్ విఫలమయ్యారు. సౌతాఫ్రికా బౌలర్‌లో.. కగిసో రబడ 3, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, తబ్రైజ్ షమ్సీ చెరో 2 వికెట్లు తీయగా.. లుంగీ నిగిడి 1 వికెట్ పడగొట్టారు.

అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్‌లకు 7 వికెట్లు కోల్పోయి 311 రన్స్ చేసింది. సౌతాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్.. వరుసగా రెండో మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగాడు. తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై 84 బంతుల్లో సెంచరీ బాదిన క్వింటన్ డికాక్, ఆస్ట్రేలియా మ్యాచ్‌లోనూ అదే ఫామ్‌ని కొనసాగించాడు. క్వింటన్ డి కాక్ సెంచరీకి తోడు అయిడిన్ మార్క్‌రమ్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా, నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 311 పరుగుల స్కోరు చేసింది. మిగిలిన బ్యాటర్స్‌లో బవుమా (35), క్లాసెన్ (29), జాన్సన్ (26) పరుగులతో రాణించారు. ఆసీస్ బౌలర్‌లో.. మాక్స్‌వెల్, స్టార్క్ చెరో 2 వికెట్లు తీశారు.

Advertisement

Next Story

Most Viewed